Sri Naradapuranam-3    Chapters    Last Page

అష్ట షష్టి తమో% ధ్యాయః అరువది యెనిమిదవ అధ్యాయము

కామోదాఖ్యానమ్‌

మోహిన్యువాచ -


కామోదాయాస్తు మాహాత్మ్యం బ్రూహి మే ద్విజసత్తమ! | యచ్చ్రుత్వాహం తవముఖా త్ర్పసన్నా స్యాం కృతార్థవత్‌ 1
మోహిని పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా ఇపుడు నాకు కామోదామాహాత్మ్యమును చెప్పుము. నీనోటి నుండి విని నేను కృతార్థురాలనై శాంతిని పొందెదను.
వసురువాచ : -
శృణు దేవి ప్రవక్ష్యామి కామోదాఖ్యానకం శుభమ్‌ | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః 2
కామోదాఖ్యం పురం దేవి గంగాతీరే వ్యవస్థితమ్‌ | కామోదా యత్ర వర్తంతే సార్థం దేవైర్హరిప్రియాః 3
యదా సురాసురై ర్దేవి మధితః క్షీరసాగరః | కామోదా సా తదోత్పన్నా కన్యార్తన చతుష్టయే 4
కన్యా రమాఖ్యా ప్రధమా ద్వితీయా వారుణీ స్మృతా | కామోదాఖ్యా తృతీయా తు చతుర్థీ తు వరాభిధా 5
తత్ర కన్యాత్రయం ప్రాప్తం విష్ణునా ప్రభవిష్ణునా | వారుణీ త్వసురై ర్నీతా విష్ణుదేవాజ్ఞయా సతీ 6
తతః ప్రభృతి లక్ష్మీస్తు విష్ణోర్వక్ష స్థ్సలే స్థితా | బభూవ విష్ణుపత్నీ సా సపత్నీ రహితా శుభే 7
భవిష్యకార్యం విజ్ఞాయ దేవా విష్ణు సమాజ్ఞయా | కామోదాఖ్యే పురే దేవీం కామోదాం పూజయన్తి హి 8
సాత్రైవ వర్తతే నిత్యం విష్ణు సంయోగ కామ్యయా | భార్యాత్వం భావతః ప్రాప్తా విష్ణుధ్యాన పరాయణా 9
స తత్ర భావ గమ్యోవై విష్ణు స్సర్వగతో మహాన్‌ | అనయాపి తయా నిత్యం వర్తతే తత్సమీపతః 10
స దేవైర్వా సురైర్దేవి! మునిభిర్మానవై స్తథా | అలక్ష్య దేహో విశ్వాత్మా వర్తతే ధ్యానగోచరః 11
ధ్యానేనైవ ప్రపశ్యన్తి దేవాశ్చ మునయో విభుమ్‌ | కామోదా సా మహాభాగా యదాహ సతి మోహిని 12
హర్షేణ తు సమావిష్టా తదాశ్రూణి పతంతి చ | ఆనందాశ్రూణి గంగాయాం పతితాని సురేశ్వరి 13
కామోదాఖ్యాని పద్మాని తాని తత్ర భవన్తి చ | పీతాని చ సుగంధీని మహామోద ప్రదాని చ 14
యస్తు భాగ్యవశాల్లభ్ద్వా తాని తైః పూజయే చ్ఛివమ్‌ | స లభేద్వాంఛితాన్కామా నిత్యాజ్ఞా పారమేశ్వరీ 15
దుఃఖజాని తధాశ్రూణి కదాచిత్ర్పపతంతి హి | తేభ్యశ్చ తాని పద్మాని సుగంధీస్యుద్భవన్తి చ 16
తైస్తు యః పూజయేద్దేవం శంకరం లోక శంకరమ్‌ | సయుజ్యేతాఖిలైర్దుఃఖైః పూర్వ పాపైర్విమోహితః 17
గంగాద్వారాదుపరిచ దశయోజనకే స్థితమ్‌ | కామోదం తత్ర వర్షైకం యో జపేద్ద్వాదశాక్షరమ్‌ 18
వర్షాంతే చైత్ర మాసస్య ద్వాదశ్యాం విధినందిని! | వాసంతీం చ శ్రియం దృష్ట్వా సా హసేద్వర్షం తస్సదా 19

తాని పద్మాని స లభే న్నాన్యదా కో
%పి కర్హిచిత్‌ | తత్ర యస్స్నాతి మనుజో విష్ణుభక్తి పరాయణః 20
ధ్యాత్వా పురం చ కామోదం స భ##వేద్విష్ణు వల్లభః | దేవతానాం పితౄణాం చ వల్లభో నాత్ర సంశయః 21
యో ద్వాదశ సమాస్తత్ర తిష్ఠేజ్జపపరాయణః | స లభేద్దర్శనం సాక్షా త్కామోదాయాశ్శుభాననే 22
యం యం చిన్తయతే కామం తత్ర తీర్థే నర శ్శుచిః | స్నానమాత్రేణ లభ##తే తం తమైహిక మంగనే 23
ఏతద్ది పరమం తీర్థం లభ్యం భాగ్య వశాద్భవేత్‌ | హిమాత్యయా దగే భ##ద్రే దుర్గమం వికట స్థలమ్‌ 24
ఏతత్తే సర్వ మాఖ్యాతం కామోదాఖ్యానకం శుభమ్‌ | యశ్శృణోతి నరో భక్త్యా సో
%పి పాపైః ప్రముచ్యతే 25
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యనమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున కామోదాఖ్యానక అను
అరువది యెనిమిదవ అధ్యాయము
వసువు పలికెను :-
ఓ మోహినీ ! కామోదాఖ్యానమును చెప్పెదను. వినుము. దీనిని విని సర్వ పాప వినిర్ముక్తుడగును. గంగా తీరమున కామోదయను నగరము కలదు. శ్రీహరి ప్రియురాళ్ళ గు కామోదలు దేవతలతో కలిసి ఇచటనే నివసింతురు. దేవదానవులు కలిసి క్షీరసాగర మధనము గావించినపుడు కన్యారత్న చతుష్టయమున కామోదకూడా ఉద్భవించెను. మొదటిది రమా, రెండవది వారుణి. మూడవది కామోదా నాలుగవది వర. వీరిలో ముగ్గురు కన్యలు శ్రీ మహావిష్ణువును పొందిరి. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞచే వారుణిని అసురులు పొందిరి. అప్పటినుండి లక్ష్మీదేవి శ్రీవిష్ణు వక్షస్థలమున నుండెను. ఈమె సపత్ని రహితముగా విష్ణుపత్ని అయ్యెను. జరుగబోవు కార్యమును తెలిసిన దేవతలు శ్రీమహావిష్ఠ్వాజ్ఞచే కామోదాయను నగరమును నిర్మించి అచట కామోదా దేవిని ప్రతిష్ఠించి పూజించు చుండిరి. కామోదాదేవి మాత్రము ఎల్లపుడు విష్ణు సంయోగమును కోరుచు ఇచటనే ఉండి భావముతో విష్ణు భార్యాత్వమును పొంది ధ్యాన పరాయణురాలాయెను. సర్వగతుడు భావగమ్యుడగు శ్రీమహావిష్ణువు ఈమె సమీపముననే యుండెను. ఇచట శ్రీ మహావిష్ణువు దేవదానవ ముని మానవులకు ఆదృశ్య దేహునిగా ధ్యానమాత్ర గోచరునిగా యుండెను. ఇచట దేవతలు మునుషులు కూడా శ్రీహరిని ధ్యానము చేతనే చూతురు. మహానుభావురాలగు కామోదా నవ్వినపుడు సంతోషాతిరేక యుక్తురాలైనపుడు కనుల నుండి నీటి బిందువులు పడును. గంగలో పడిన ఆనందాశ్రువులు కామోదములను పద్మము లగును. ఇవి పసుపు పచ్చగా సుగంధము కలవిగా ఉండును. అదృష్టవశమున ఈ పద్మములను పొందినవారు ఈ పద్మములతో శివుని పూజించ వలయును. అతను వాంఛితకామములను పొందునని పరమేశ్వరాజ్ఞ' కామోదాదేవికి దుఃఖము కలిగినపుడు దుఃఖాశ్రువులు గంగలో పడి గంధరహితములగు పద్మములు పుట్టును. ఈ పద్మములతో శంకరుని పూజించినచో పూర్వ పాపమోహితుడై సకల దుఃఖములను పొందును. గంగా ద్వారమునకు ఉపరి భాగమున దశయోజన దూరము నున్న కామోద తీర్థమున ఒక సంవత్సరము ద్వాదశాక్షర మంత్రమును జపించ వలయును. వర్షాంతమున చైత్ర ద్వాదశినాడు వసంత శోభను చూచి కామోదాదేవి సంతోషముతో నవ్వును. అపుడు ఆ పద్మములను పొందగలడు. మరియొక విధమున పొందజాలడు. ఇచట విష్ణుభక్తి పరాయణుడై కామోద పురమును ధ్యానము చేసి స్నానమాడినచో శ్రీహరి ప్రియుడగును. దేవతలకు పితరులకు కూడా ప్రీతి పాత్రుడగును. ఇచట పన్నెండు సంవత్సరములుండి జపపరాయణుడైనచో ప్రత్యక్షముగా కామోదాదేవిని దర్శించగలడు. ఈ తీర్థమున శుచియై స్నానము చేసినచో తలచిన కోరికలను పొందగలడు. ఈ తీర్థము పరమోత్తమము. భాగ్యవశమున మాత్రమే లభించును. మంచు కరిగినపుడు మాత్రమే కనిపించును. అపుడైనను చాలా కష్ఠముచే వెళ్ళ దగిన వికట స్థలమున కలదు. ఇట్లు కామ శుభకరమగు కామోదాఖ్యానమును తెలిపితిని. ఈ అఖ్యానమును భక్తిచే వినినవారు కూడా పాప విముక్తులగుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యనమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున కామోదాఖ్యానమను మాహాత్మ్యమను
అరువది యెనిమిదవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page